ఏసీబీ అధికారులు పాస్‌పోర్ట్ ప్రొటెక్షన్ కోరారు..
కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు:

అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్
హైదరాబాద్ సెప్టెంబర్ 30 ద్రోణ :- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ పాస్‌పోర్ట్ ను సీజ్ చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ తెలిపారు. ఏసీబీ అధికారులు పాస్‌పోర్ట్ ప్రొటెక్షన్ కావాలని కోరినప్పటికీ, పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు పాస్‌పోర్ట్ ప్రొటెక్షన్ ఎందుకు కోరుతున్నారనే అంశాన్ని పరిశీలించి, అవసరమైతే ఆ విషయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. కోర్టు ఆదేశాలు లేకుండానే కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేసినట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్, కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పరిధిలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు
