పదిహేను మంది ఉపాధ్యాయులకు సన్మానం

బోధన్, సెప్టెంబర్ 29ద్రోణ:- ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందిస్తున్న (15) పదిహేను మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మంగళవారం లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం పీ డీ వో కిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని అన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.
ఎం పీ ఓ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించి, ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
మండల విద్యాధికారి నాగయ్య మాట్లాడుతూ మండల పరిధిలో ఉత్తమ సేవలు అందిస్తున్న పదిహేను (15) మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి సత్కరించినట్లు తెలిపారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు భవిష్యత్తులోనూ మరింత ఉత్సాహంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అవార్డులు అందుకున్న వారు

వి. నరేందర్ – జీహెచ్ఎం, జీఎంఎంహెచ్ఎస్, ఎస్కేఎన్ఆర్
ఈ. విజయలక్ష్మి – పీఎస్టీఎం, ఎంపీపీఎస్, సంగం
కె. లక్ష్మి – పీడీ, జెడ్పీహెచ్ఎస్
విజయ భాస్కర్ – ఎస్ఏ, జెడ్పీహెచ్ఎస్
ఎం. రవీందర్ – ఎస్ఏ, జీహెచ్ఎస్
వెంకట రమణ – ఎస్ఏ, ఎంపీయూపీఎస్
బస్వరాజ్ – ఎస్ఏ, జీహెచ్ఎస్
సందీప్ కుమార్ – ఎస్జీటీ, ఎంపీపీఎస్, పెగడల్
వరలక్ష్మి – ఎస్జీటీ, ఎంపీపీఎస్
కె. జ్యోతి – ఎస్జీటీ, ఎంపీపీఎస్, అచ్చంపల్లి
కె. సుహాసిని – ఎస్జీటీ, ఎయిడెడ్ పీఎస్, ఎస్కేఎన్ఆర్
సలేహా రిజ్వాన్ – ఎస్ఏ, జెడ్పీహెచ్ఎస్
అఖిల్ ఉన్నిసా బేగం – ఎస్ఏ, జీహెచ్ఎస్ (గర్ల్స్)
అంజుమ్ ఫీర్దోస్ – ఎస్జీటీ, ఎంపీపీఎస్
జహీదా తస్నీమ్ – ఎస్జీటీ, యూపీఎస్ గర్ల్స్, ఎస్కేఎన్ఆర్

ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా, మండల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
