Thursday, October 1, 2026

కఠువాలో (CISF) సి,ఐ,యస్,ఎఫ్ జవాన్ కాల్పులు.. నలుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లో దారుణ ఘటన..

సహచరులపై కాల్పులు జరిపిన హెడ్ కానిస్టేబుల్

న్యూఢిల్లీ సెప్టెంబర్ 30 ద్రోణ:- జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో మంగళవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. బసోహ్లి ప్రాంతంలోని సేవా జలవిద్యుత్‌ ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహిస్తున్న (CISF) సి,ఐ,యస్,ఎఫ్ సిబ్బందిపై అదే బలగానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు సిబ్బంది మృతి చెందారు.
అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సహచరులతో జరిగిన వాగ్వాదం అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌ అబ్దేహేశ్‌ కుమార్‌ (కొన్ని నివేదికల్లో అవదేశ్‌ కుమార్‌ సింగ్‌గా పేర్కొన్నారు) తన సర్వీస్‌ రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ అంకిత్‌ కుమార్‌ పాండే, ఎస్‌ఐ లక్ష్మణ్‌ సింగ్, కానిస్టేబుళ్లు రఫీక్‌ అహ్మద్‌, సంజీవ్‌ కుమార్‌ మృతి చెందినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నలుగురిని సమీపంలోని (NHPC)యన్,యచ్,పి,సి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం సహచర సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని సర్వీస్‌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.
కాల్పులకు దారితీసిన వాగ్వాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు, (CISF) సి ఐ యస్ ఎఫ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular