మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి
నల్గొండ–ఖమ్మం–వరంగల్ నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి ఖరారు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 ద్రోణ : తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డిని, నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. అభ్యర్థుల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా ఎన్నికల సందడి ప్రారంభమైంది.
