
అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు
బోధన్ అక్టోబర్ 01 ద్రోణ:- బోధన్ మండలం సంగం గ్రామంలో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ రేషన్‌తో పాటు అర్హతకు అనుగుణంగా వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరిఫ్ పటేల్, కాంగ్రెస్ నాయకులు ఎం. విఠల్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు కె. ముత్తారెడ్డి, ఎం. గోపాల్ రెడ్డి, సుంకరి సాయిలు, గ్రామ రెవెన్యూ పాలన అధికారి షఫీ, పంచాయతీ కార్యదర్శి సాయిలుతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
