బోధన్ అక్టోబర్ 01 ద్రోణ:- మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామ రామ్మోహన్‌రెడ్డి ఎంపికైన సందర్భంగా బోధన్ నియోజకవర్గ (NSUI) ఎన్,ఎస్,యు,ఐ విద్యార్థి విభాగం, సోషల్ మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

సామ రామ్మోహన్‌రెడ్డికి రాజకీయ, ప్రజా వ్యవహారల్లో అనుభవం ఉందని వారు పేర్కొన్నారు. వాగ్ధాటి, విషయాలపై అవగాహన, విశ్లేషణాత్మక దృక్పథం, పట్టుదలతో పనిచేసే తత్వం వంటి లక్షణాలతో ఆయన పార్టీ కార్యకలాపాల్లో కొనసాగుతున్నారని తెలిపారు. పట్టభద్రుల సమస్యలను శాసనమండలి వేదికగా ప్రస్తావించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. సామ రామ్మోహన్‌రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన విషయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ (NSUI) ఎన్, ఎస్, యు, ఐ, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం తరఫున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
