Friday, October 2, 2026

బీచ్‌లో విషాదం..

8 మంది విద్యార్థులు మృతి

పిక్నిక్‌కు వెళ్లిన ఇంటర్‌ విద్యార్థులపై మృత్యువు పంజా….

ఈతకు వెళ్లి గల్లంతు

పూణే అక్టోబర్01ద్రోణ:- మహారాష్ట్రలోని పుణే సమీపంలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌కు చెందిన 48 మంది ఇంటర్‌ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా బీచ్‌లో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఎనిమిది మంది గల్లంతయ్యారు.
విద్యార్థులు గల్లంతైన విషయాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు, స్థానికులు వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే సముద్రంలో అలలు ఉధృతంగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
గాలింపు చర్యల్లో గల్లంతైన ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో పిక్నిక్‌ కాస్తా విషాదంగా మారింది. విద్యార్థుల మృతితో వారి కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలిలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular