నియామకంపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం..

సుదర్శన్‌రెడ్డికి కృతజ్ఞతలు
బోధన్ అక్టోబర్ 01 ద్రోణ:- వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా శ్రీ దేవభక్తుని నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నియామకానికి సహకరించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ శాసనసభ్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతుల సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
