టెలిగ్రామ్‌లో శిక్షణ.. రూ.100, రూ.500 నోట్ల ముద్రణ
జన్మాష్టమి జాతరలో చలామణి..

నిందితుడి అరెస్టు
రాజ్‌కోట్ అక్టోబర్ 01 ద్రోణ:- ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన రీల్ చూసిన ఓ కూరగాయల వ్యాపారి.. అదే బాట పట్టి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.
రాజ్‌కోట్‌కు చెందిన కిషన్ సోలంకి అనే కూరగాయల వ్యాపారికి ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన ఓ వీడియో కనిపించింది. ఆ వీడియో వెనుక ఉన్న వ్యక్తిని సంప్రదించిన కిషన్‌కు టెలిగ్రామ్ ద్వారా నకిలీ నోట్ల తయారీపై సూచనలు అందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నకిలీ నోట్ల తయారీకి అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్న అతడు రూ.100, రూ.500 విలువైన నకిలీ నోట్లను తయారు చేసినట్లు వెల్లడించారు.
తయారు చేసిన నకిలీ నోట్లను చిన్నచిన్న కొనుగోళ్లకు ఉపయోగిస్తూ చలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన జన్మాష్టమి జాతరలోనూ నకిలీ నోట్లను ఉపయోగించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కిషన్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అతడి కదలికలను గమనించారు.
చివరకు నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి కిషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 216 నకిలీ రూ.100 నోట్లు, మూడు నకిలీ రూ.500 నోట్లు, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సామగ్రి విలువ సుమారు రూ.65,500 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
