Saturday, October 3, 2026

ఎమ్మెల్యేతో నాకు ఎలాంటి సంబంధం లేదు:

డా. తారా శ్వేత

వైరల్‌ ఆడియో నకిలీ..

ఏఐ ద్వారా రూపొందించినదే ?

తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ అక్టోబర్ 02 ద్రోణ:- ఓ ఎమ్మెల్యేతో తనకు సంబంధం ఉందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని డా. తారా శ్వేత తీవ్రంగా ఖండించారు. తనపై వైరల్‌ అవుతున్న ఆడియో పూర్తిగా నకిలీదని, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి రూపొందించినదని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియోను విడుదల చేసి, సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా నకిలీ ఆడియోను రూపొందించి, దానిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.

నకిలీ ఆడియోలు, అసత్య ప్రచారాల ద్వారా వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదని, ఇటువంటి కంటెంట్‌ను నమ్మకుండా ఇతరులకు ఫార్వర్డ్‌ చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular