53వ వార్డులోని నాలుగు గ్రామాలు ఆదిభట్ల పీఎస్ పరిధిలోకి….

మీర్‌పేటలోని పలు ప్రాంతాలు కూడా బదిలీ
హైదరాబాద్ అక్టోబర్02ద్రోణ:- మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ లో సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాలను ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
53వ వార్డుకు చెందిన తొర్రూర్, మునగనూర్, బ్రాహ్మణపల్లి, కోహెడ గ్రామాలు ఇకపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి రానున్నాయి. ఆయా ప్రాంతాలకు సంబంధించిన శాంతిభద్రతలు, పోలీస్ వ్యవహారాలను ఇక నుంచి ఆదిభట్ల పోలీసులు పర్యవేక్షించనున్నారు.
అదేవిధంగా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్‌రెడ్డి వార్డు, హస్తినాపురం వార్డు ప్రాంతాలను మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నీ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి మారనున్నాయి. ఈ మార్పులతో ఆయా ప్రాంతాల పోలీస్ పరిపాలన పరిధి పునర్వ్యవస్థీకరణ జరిగినట్లైంది.
