Saturday, October 3, 2026

అక్టోబర్‌ నెలంతా దేశవ్యాప్తంగా నిరసనలు

రాజీనామా చేయాలంటూ (CJP)సి,జే,పి డిమాండ్‌

ముంబయి, అక్టోబర్‌ 2 (ద్రోణ): చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP)సి,జే,పి అక్టోబర్‌ 2 నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఈ విషయాన్ని ప్రకటించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)యస్,ఐ,అర్ ప్రక్రియను నిలిపివేయాలని (CJP)సి,జే,పి డిమాండ్‌ చేస్తోంది. 2025 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. ఎన్నికల ప్రక్రియపై తలెత్తిన అనుమానాలపై జవాబుదారీతనం, పారదర్శకత అవసరమని పార్టీ పేర్కొంది.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ముంబయిలోని దాదర్‌ శివాజీ పార్క్‌ వద్ద నిరసనతో ఆందోళన ప్రారంభించనున్నట్లు దీప్కే తెలిపారు. అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించి, అక్టోబర్‌ చివర్లో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే శివాజీ పార్క్‌లో నిరసనకు ముంబయి పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సెప్టెంబర్‌ 27న వెల్లడైంది. అయినప్పటికీ అక్కడే ఆందోళన చేపడతామని CJP ప్రకటించి, అనుమతి లేకుంటే ‘జైల్‌ భరో’ ఆందోళనకు దిగుతామని తెలిపింది. ఎన్నికల సంఘం తన నిర్ణయాలు చట్టపరమైన ప్రక్రియలో భాగమేనని, నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని వివరణ ఇచ్చినట్లు వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular