వైకల్య శాతాన్ని బట్టి కాలపరిమితి..
ఏటా రెన్యువల్ ఇబ్బందులకు చెక్

నిజామాబాద్ అక్టోబర్ 02 ద్రోణ:- దివ్యాంగుల వాహనాలకు టోల్ మినహాయింపు కల్పించే ‘ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్’ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ఫాస్టాగ్ కాలపరిమితిని దివ్యాంగుల వైకల్య శాతాన్ని ఆధారంగా నిర్ణయించనున్నారు.
70 నుంచి 100 శాతం వరకు వైకల్యం ఉన్న వారికి ఐదేళ్ల కాలపరిమితితో, 40 నుంచి 70 శాతం వరకు వైకల్యం ఉన్న వారికి మూడేళ్ల కాలపరిమితితో ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ జారీ చేయనున్నారు. ఇప్పటివరకు ఏటా ఫాస్టాగ్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి రావడంతో దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. కొత్త నిబంధనలతో అర్హులైన దివ్యాంగులకు తరచూ రెన్యువల్ చేసుకునే అవసరం తగ్గడంతో పాటు, టోల్ మినహాయింపు పొందే ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
