Saturday, October 3, 2026

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులు

కొత్త జోన్లు..

పోలీస్ స్టేషన్ పేర్లు మార్పు…..

పలు ప్రాంతాల సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ

హైదరాబాద్ అక్టోబర్02 ద్రోణ:- జీ హెచ్‌ ఎం సీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. పోలీస్ కమిషనరేట్ పరిధులు, జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దులను సవరిస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 84 జారీ చేసింది.

పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆర్జీఐఏ డివిజన్ పేరును ‘శంషాబాద్’గా, చిక్కడపల్లి డివిజన్‌ను ‘కాచిగూడ’గా, సంతోష్‌నగర్ డివిజన్‌ను ‘చత్రినాక’గా మార్చారు. దీంతో ఆయా ప్రాంతాల పోలీస్ పరిపాలనా పరిధుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

అలాగే బడంగ్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బేగంపేట, తిరుమలగిరి ప్రాంతాలను మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోకి బదిలీ చేశారు. పలు పోలీస్ స్టేషన్ లో పరిధులు, జోన్లు, డివిజన్ల సరిహద్దులను కూడా ప్రభుత్వం పునర్నిర్వచించింది.

ఇదే క్రమంలో మహిళా పోలీస్ స్టేషన్లు, సైబర్ సెల్‌ల పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మారుతున్న పరిపాలనా సరిహద్దులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల పోలీస్ పరిపాలనా పరిధులు మారనున్నాయి. కొత్త సరిహద్దులకు అనుగుణంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధులు, అధికారుల బాధ్యతల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular