పీజీ విద్య వత్సలకు ‘మేముసైతం’ అండ….

రూ.7 వేల ఆర్థిక సాయం
ఇంద్రవెల్లి అక్టోబర్ 03 ద్రోణ:- పేదరికం కారణంగా ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినికి ‘మేముసైతం’ స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనందించింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామానికి చెందిన వత్సల పీజీ కోర్సు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యా అవసరాల కోసం ఆర్థిక సాయం కోరుతూ ఆమె ‘మేముసైతం’ సంస్థను సంప్రదించారు. వత్సల పరిస్థితిని తెలుసుకున్న సంస్థ చైర్మన్ డా. నవీన్ కుమార్ గైని స్పందించి సంస్థ తరఫున రూ.7 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సాయం ఆమె ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. వత్సల చదువుకు భవిష్యత్తులోనూ ‘మేముసైతం’ సంస్థ అండగా ఉంటుందని డా. నవీన్ కుమార్ గైని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి రాకుండా విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
