తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

బాపూజీ స్మరణలో రక్తదాన శిబిరం
హైదరాబాద్, అక్టోబర్ 3ద్రోణ:- మహాత్మా గాంధీ చూపిన అహింస, సామాజిక న్యాయం, సమానత్వం మార్గంలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలంగాణ రక్షణ సేన నాయకులు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అనంతరం బాపూజీ స్మరణలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కూకట్‌పల్లి ఓమిని హాస్పిటల్స్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు రక్తాన్ని సేకరించారు. ఈ శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిపి 45 మంది రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ ఆచారి, మాసన్నగారి బాలయ్య, కోల శ్రీనివాస్, వేముల భవాని, శివారెడ్డి, మనోజా గౌడ్, హలీమా తదితరులు పాల్గొన్నారు.
