Sunday, October 4, 2026

వృద్ధుల సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకం

75 ఏళ్లు పైబడిన ఆరుగురు సీనియర్ సిటిజన్లకు లైన్స్ క్లబ్ ఆఫ్ ఆచనపల్లి సత్కారం

బోధన్ ఆచంపల్లి అక్టోబర్ 03ద్రోణ:- గాంధీ జయంతి, సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఆచనపల్లి ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ విజయసాయి ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాల వయసు పైబడిన ఆరుగురు సీనియర్ సిటిజన్లను క్లబ్ ప్రతినిధులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

సన్మానం అందుకున్న వారిలో వేములపల్లి సత్యనారాయణ, మేదరమెట్ల హరిబాబు, పోలిమెట్ల గాంధీ, బండారు ముత్తయ్య, మన్నెం కృష్ణమూర్తి, అయినంపూడి కృష్ణారావు ఉన్నారు. వృద్ధుల అనుభవాలు, సేవలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలోని లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో లాల్‌బహదూర్ శాస్త్రి, మహాత్మాగాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు వై. దుర్గారావు, కార్యదర్శి వెంకటరమణారెడ్డి, కోశాధికారి కైలాసప్ప, క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్. కృష్ణమోహన్, లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీనివాసరాజు, ప్రోగ్రాం చైర్మన్ ఎం. రమణారెడ్డి, ప్రోగ్రాం సహాయ చైర్మన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular