Sunday, October 4, 2026

నూతన కోర్టు భవన సముదాయానికి కసరత్తు

రూ.19 కోట్లతో జీ+2 భవన నిర్మాణానికి ప్రొఫార్మా అంచనా..

పరిపాలనా అనుమతుల కోసం హైకోర్టుకు ప్రతిపాదనలు

బోధన్, అక్టోబర్ 3ద్రోణ:- బోధన్‌లో నూతన రెండు కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పాత మున్సిఫ్ కోర్టు భవన సముదాయ ప్రాంగణంలో నూతన కోర్టు భవనాలను నిర్మించేందుకు రూ.19 కోట్లతో ప్రొఫార్మా అంచనాను రూపొందించారు. ఈ మేరకు లేఅవుట్‌ ప్లాన్‌తో పాటు ప్రతిపాదనలను పరిపాలనా అనుమతుల కోసం హైకోర్టుకు పంపినట్లు నిజామాబాద్ ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి జి.వి.ఎన్. భారతి లక్ష్మి వెల్లడించారు.
బోధన్ బార్ అసోసియేషన్ గతంలో సమర్పించిన వినతిపత్రం మేరకు నూతన కోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్‌ ప్లాన్, డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు, భవన నిర్మాణ ప్రణాళికలను హైకోర్టు కోరింది. దీనికి అనుగుణంగా నిజామాబాద్ ఆర్‌అండ్‌బీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జీ+2 అంతస్తుల భవన నిర్మాణానికి (జీ+5 డిజైన్ ఫౌండేషన్‌తో) రూ.19 కోట్ల ప్రొఫార్మా అంచనాను, లేఅవుట్‌ ప్లాన్‌ను సమర్పించారు.
ఈ ప్రతిపాదనలను పరిపాలనా అనుమతుల కోసం జిల్లా న్యాయస్థానం ద్వారా ఇప్పటికే పంపించారు. ఈ నేపథ్యంలో బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సెప్టెంబర్ 24న మరోసారి సమర్పించిన వినతిపత్రాన్ని కూడా ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి హైకోర్టు రిజిస్ట్రార్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)కు పంపించారు. నూతన కోర్టు భవన సముదాయ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ కోరుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular