Tuesday, October 6, 2026

పోతంగల్‌లో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులకు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

పోతంగల్, అక్టోబర్ 05ద్రోణ:- విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో పోతంగల్ రైస్ మిల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం 11.30 గంటలకు సంఘం పీఐసీ/అధ్యక్షులు శ్రీ ఎం.డి. రియాజోద్దీన్ ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేందుకు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఏఓ, సంఘ రైతులు, గ్రామ పెద్దలు, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular