
బెల్లల్ ఇంటిగ్రేటెడ్ పనులు వేగవంతం చేయాలి: పి. సుదర్శన్‌రెడ్డి
బోధన్ :- ఇందిరమ్మ కాలనీలో ఇంటిగ్రేటెడ్ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి సూచించారు. కాలనీలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లకు పైకప్పు రేకులు, కిచెన్ నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.లక్ష చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో మరింత వెసులుబాటు కలగనుంది.

కాలనీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయడంతో పాటు పనులను వేగవంతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డికి బెల్లల్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.
