
సాలూరు మండల కాంగ్రెస్ నాయకుల అభినందనలు
బోధన్ టౌన్ అక్టోబర్ 07 ద్రోణ:- వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన డి. నాగేశ్వర్ రావును సాలూరు మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో సాలూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మందర్న రవి, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తగ్గేల్లి దేవరావు తదితరులు నాగేశ్వర్ రావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేసి, మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
