Thursday, October 8, 2026

తెలంగాణలో 91.92 లక్షల మందికి SIR నోటీసులు

తుది జాబితాకు 71.23 లక్షల మంది అర్హులుగా నిర్ధారణ

హైదరాబాద్ అక్టోబర్ 07 ద్రోణ :- తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఏస్,ఐ,ఆర్ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 92,88,180 (SIR) ఎస్,ఐ,ఆర్ నోటీసులు జనరేట్ కాగా, వాటిలో 91,92,625 నోటీసులు సంబంధిత ఓటర్లకు అందజేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి తెలిపారు. మరో 95,555 నోటీసులు పంపిణీ కావాల్సి ఉంది. SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల్లో తలెత్తిన లాజికల్ డిస్క్రెపెన్సీలు, మ్యాపింగ్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తాజా స్థితిగతుల ప్రకారం 71,23,526 మంది ఓటర్లు తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అర్హులుగా నిర్ధారించినట్లు తెలిపారు. (SIR) ఎస్,ఐ,ఆర్ లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 7తో ముగిసింది. తదుపరి దశలో నోటీసులకు సంబంధించిన పరిశీలన, విచారణ ప్రక్రియ కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు ఎన్నికల వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular