Friday, October 9, 2026

మార్కెట్లకు భారీ షాక్‌.. సెన్సెక్స్‌ 1,045 పాయింట్లు పతనం

ముడిచమురు ధరల పెరుగుదల…

అమ్మకాల ఒత్తిడితో నేలచూపులు

ముంబై, అక్టోబర్ 08 ద్రోణ:-
దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆందోళనతో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు గణనీయంగా పతనమయ్యాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,045 పాయింట్లు కోల్పోయి 71,593 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 371 పాయింట్లు నష్టపోయి 22,231 వద్ద స్థిరపడింది. ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి కొనసాగగా.. ముఖ్యంగా పలు కీలక రంగాల షేర్లలో భారీగా విక్రయాలు చోటుచేసుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపింది. ముడిచమురు ధరల పెరుగుదలతో దేశ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయాల భారం పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వడ్డీ రేట్లకు సంబంధించిన పరిణామాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులతో పాటు దేశీయ మదుపరులు కూడా అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లలో అమ్మకాల జోరు పెరిగింది. బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియల్టీ తదితర రంగాల షేర్లలో ఒత్తిడి కనిపించింది. ఒక్కరోజులోనే సూచీలు వెయ్యి పాయింట్లకు పైగా పడిపోవడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular