51 మొక్కలు స్వాధీనం
రూ.5.10 లక్షల విలువైన గంజాయి మొక్కలు గుర్తింపు..

నిందితుడి అరెస్ట్
నేరడిగొండ, అక్టోబర్ 08ద్రోణ:- పత్తి పంట మధ్యలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నేరడిగొండ మండలం అరేపల్లి శివారులో పత్తి పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయి మొక్కలను గుర్తించారు.
అరేపల్లి శివారులోని పత్తి చేనులో సిడాం గంగారాం (60) సాగు చేస్తున్న 51 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.5.10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంగారాంను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
