ఐరాస వేదికగా భారత్ తీవ్ర వ్యాఖ్యలు..
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ బాధిత దేశంగా నటించడం
కుదరదని స్పష్టీకరణ
పాక్ పెంచిన ఉగ్రవాదమే ఇప్పుడు పాక్‌ను వెంటాడుతోంది
ఐరాస వేదికగా భారత్ తీవ్ర వ్యాఖ్యలు..

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ బాధిత
దేశంగా నటించడం కుదరదని స్పష్టీకరణ
న్యూయార్క్, అక్టోబర్ 8ద్రోణ:- ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా తీవ్రంగా ప్రశ్నించింది. పొరుగు దేశాల్లో విధ్వంసానికి ఉపయోగపడే ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పాకిస్థాన్ గతంలో ఆశ్రయం, మద్దతు కల్పించిందని భారత్ ఆరోపించింది. ఇప్పుడు అదే ఉగ్రవాద మౌలిక వ్యవస్థ పాకిస్థాన్‌లోనే హింసకు కారణమవుతోందని పేర్కొంది.
ఐరాస జనరల్ అసెంబ్లీ ఆరో కమిటీ సమావేశంలో భారత్ తరఫున రఘూ పూరి మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ప్రకటనలు చేయడం మాత్రమే సరిపోదని, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారు, వారికి ఆశ్రయం కల్పించేవారు, శిక్షణ ఇచ్చేవారు, ప్రోత్సహించేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
‘బాధిత దేశం’గా చెప్పుకోవడం సరికాదు
పాకిస్థాన్ ఒకవైపు ఉగ్రవాద బాధిత దేశంగా అంతర్జాతీయ సమాజం ముందు చెప్పుకుంటూనే.. మరోవైపు ఉగ్రవాద సంస్థలకు గతంలో మద్దతు ఇచ్చిందని భారత్ విమర్శించింది. ఉగ్రవాదులను పెంచి పోషించి, వారికి సురక్షిత స్థావరాలు కల్పించినప్పుడు బాధితులకు న్యాయం జరగదని పేర్కొంది. ఉగ్రవాదాన్ని మంచి–చెడు అనే తేడాతో చూడకుండా అన్ని రూపాల్లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది.
మసూద్ అజర్ అంశంపైనా ప్రశ్నలు
జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌పై పాకిస్థాన్ ప్రకటించిన బహుమతి విషయంలోనూ భారత్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై నిజంగా చర్యలు తీసుకోవాలంటే ప్రకటనలకే పరిమితం కాకుండా ఉగ్రవాదులపై, వారి నిర్వాహకులు, ఆర్థిక సహాయకులు, ప్రోత్సాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
9/11, 26/11, పహల్గామ్ వంటి ఉగ్రదాడులను ప్రపంచం మరచిపోలేదని భారత్ ఐరాసలో గుర్తుచేసింది. సరిహద్దులు దాటి జరిగే ఉగ్రవాదం అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా కొనసాగుతోందని పేర్కొంది.
న్యూయార్క్, అక్టోబర్ 8 ద్రోణ:- ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా తీవ్రంగా ప్రశ్నించింది. పొరుగు దేశాల్లో విధ్వంసానికి ఉపయోగపడే ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పాకిస్థాన్ గతంలో ఆశ్రయం, మద్దతు కల్పించిందని భారత్ ఆరోపించింది. ఇప్పుడు అదే ఉగ్రవాద మౌలిక వ్యవస్థ పాకిస్థాన్‌లోనే హింసకు కారణమవుతోందని పేర్కొంది.