తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు సెలవులు..
23న పాఠశాలల పునఃప్రారంభం
ఏపీలో అక్టోబర్ 21 వరకు సెలవులు..
22 నుంచి తరగతులు
హైదరాబాద్‌అక్టోబర్ 09ద్రోణ::- దసరా పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవుల షెడ్యూల్ ప్రకటించినట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు వేర్వేరు తేదీల్లో ముగియనున్నాయి.

తెలంగాణలో 13 రోజుల సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 21 వరకు
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు వర్తించనున్నాయి. సెలవుల అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెలవుల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ ఆదేశించినట్లు సమాచారం. సెలవుల షెడ్యూల్‌కు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయా పాఠశాలల నుంచి అధికారిక వివరాలను నిర్ధారించుకోవడం మంచిది.
