Saturday, October 10, 2026

నిజామాబాద్‌లో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి

పదిేళ్ల తర్వాత పోలింగ్‌..

మధ్యాహ్నం 12 గంటల వరకు 50 శాతం ఓటింగ్‌ నమోదు

నిజామాబాద్‌, అక్టోబర్ 09ద్రోణ:- జిల్లాలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల సందడి మొదలైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యూనియన్‌ ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఉద్యోగులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 1,869 ఓట్లు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఎన్నికల్లో కూటమి పక్షంతో పాటు మరో వర్గం పోటీకి నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. కూటమి నాయకులు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రత్యర్థి వర్గం కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు యూనియన్లు కీలక పాత్ర పోషించాల్సి ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి సమస్యలను ప్రభుత్వం దృష్టిక తీసుకెళ్లడంతో పాటు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కృషి చేస్తామని కూటమి పక్షం నాయకులు పేర్కొంటున్నారు.

0-4064×3048-0-0-{}-0-12#bokehtype:0#;illum:2 scene:50 humanIn:7;

పదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఈసారి తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫలితాలపై ఆర్టీసీ ఉద్యోగులు, యూనియన్‌ నాయకులలోఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular