Sunday, October 11, 2026

ఢిల్లీ నిరసనలపై ఐరాస ఆందోళన..!

నిర్బంధాలపై మానవ హక్కుల సంస్థ స్పందన..

శాంతియుత నిరసనల హక్కును గౌరవించాలని సూచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 10(ద్రోణ):- ఢిల్లీలో నిరసనకారులు, రాజకీయ నాయకులు, పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులను నిర్బంధించారనే వార్తలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం (యూఎన్‌హెచ్‌ఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని, ఆందోళనకారుల పట్ల చట్టాన్ని అమలు చేసే అధికారులు సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు నిర్బంధాలకు సంబంధించిన నివేదికలపై స్పందించిన ఐరాస మానవ హక్కుల విభాగం.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పరిరక్షించడం అత్యంత ముఖ్యమని పేర్కొంది. నిరసనల్లో పాల్గొన్నందుకు నిర్బంధించిన వారందరినీ తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని సూచించింది. ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు సంబంధిత వర్గాలతో అర్థవంతమైన చర్చలు జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కులకు రక్షణ కల్పించడంతోపాటు, శాంతియుత నిరసనలకు అవకాశం కల్పించడం ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థల బాధ్యతను గుర్తుచేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular