Sunday, October 11, 2026

మూఢనమ్మకానికి బలైన తల్లి..

కొడుకు చేతిలో సజీవ దహనం!

మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో తల్లిపై దాడి…

డీజిల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక సమాచారం

మెదక్, అక్టోబర్ 11(ద్రోణ):- జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకం, అనుమానం ఓ తల్లి ప్రాణాలను బలిగొన్నాయి. టెక్మాల్ మండలం ఎల్లుపేట్ గ్రామంలో మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో కన్న తల్లి పైనే కుమారుడు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. గ్రామానికి చెందిన సాయమ్మ (40)పై ఆమె 18 ఏళ్ల కుమారుడు దుర్గేశ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. తొలుత తల్లిని కొట్టి, అనంతరం ఆమె పై డీజిల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాల పాలైన సాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కన్నకొడుకు చేతిలోనే తల్లి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిగా పేర్కొంటున్న దుర్గేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనకు దారితీసిన పరిస్థితుల పై దర్యాప్తు చేపట్టారు. అనుమానాలు, మూఢనమ్మకాల కారణంగా కుటుంబాల్లోనే ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular