మేజిస్ట్రేట్ ఎదుట హాజరు!
బీ ఎన్ ఎస్ ఎస్ 126, 170 సెక్షన్ల కింద కేసులు..
ధ్రువ్ రాఠీ విడుదల
న్యూఢిల్లీ, అక్టోబర్ 11(ద్రోణ):- అరెస్టైన (CJP) సి,జే,పి నేతలు అభిజీత్, అశుతోష్, సౌరవ్‌లను పోలీసులు కాసేపట్లో ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు సమాచారం. వీరిపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) బి,యన్, యస్,యస్ లోని సెక్షన్ 126, సెక్షన్ 170 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణ, శాంతి భంగాన్ని నిరోధించే చర్యలకు సంబంధించి సెక్షన్ 126ను, నేరాలను అడ్డుకు నేందుకు ముందస్తు చర్యలకు సంబంధించి సెక్షన్ 170ను పోలీసులు ప్రయోగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముగ్గురిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచే ప్రక్రియ చేపట్టారు.

మరో వైపు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు విడుదల చేసినట్లు తెలిసింది. తిరిగి జంతర్ మంతర్ వద్ద కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఢిల్లీలో చోటుచేసుకున్న అరెస్టుల వ్యవహారం చర్చ నీయాంశంగా మారింది.
