Monday, October 12, 2026

మోదీ, విజయ్‌ ఒకే మెట్రోలో ప్రయాణం!

చెన్నై మెట్రో రెండో దశకు శ్రీకారం..

విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని, సీఎం

చెన్నై, అక్టోబర్‌ 11(ద్రోణ):- తమిళనాడు రాజకీయాలలో ఆసక్తి పరిణామంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి విజయ్‌ కలిసి చెన్నై మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైలు రెండో దశలో భాగంగా నిర్మించిన తొలి మార్గాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఇద్దరు నేతలు ఒకే రైలులో పక్కపక్కనే కూర్చొని ప్రయాణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చెన్నైలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో పూనమల్లి నుంచి వడపళని వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించినట్లు సమాచారం. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ, సీఎం విజయ్‌ పూనమల్లి నుంచి పోరూర్‌ బైపాస్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైలులో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఐఐటీ మద్రాస్‌లో జరిగే కార్యక్రమంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి కొత్త మార్గంలో సాధారణ ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.

నగర ప్రజల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో ఈ మెట్రో మార్గం కీలకంగా నిలవనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular