Tuesday, October 13, 2026

బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌!

సీసీ కెమెరాలు, సాంకేతిక

ఆధారాలతో విక్రమ్‌ గుర్తింపు..

మరో నలుగురు వాచ్ మెన్ లను

ప్రశ్నిస్తున్న పోలీసులు

బొల్లారం, అక్టోబర్ 12(ద్రోణ):- ఆరేళ్ల చిన్నారి దారుణ హత్య ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించినట్లు సమాచారం.

చిన్నారి హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడిని గుర్తించారు. ఘటన జరిగిన సొసైటీలో పనిచేస్తున్న మరో నలుగురు వాచ్‌మెన్లను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న మీడియా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ సుమతి వెల్లడించనున్నారు. పోలీసుల అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular