
ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.
ఢిల్లీ, అక్టోబర్ 12(ద్రోణ):- ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ పాదయాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శ్రీ దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, జాటోతు రామచంద్ర నాయక్, కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నమ్మిండ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు ఎమ్మెల్యే లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.
