Wednesday, October 14, 2026

పెళ్లి విషయంలో విభేదం..

వివాహిత దారుణ హత్య!

జైలులో భర్త..

ఆటో డ్రైవర్‌తో పరిచయం…

పెళ్లి చేసుకోవాలని కోరడంతో కత్తితో దాడి

హైదరాబాద్, అక్టోబర్ 13(ద్రోణ):- కూకట్‌పల్లి పరిధిలోని అల్లాపూర్‌ మోతీనగర్‌లో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని సూచించినందుకు ఓ ఆటో డ్రైవర్‌ వివాహితను కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన అంజలి (23) భర్త గత రెండేళ్లుగా జైలులో ఉండటంతో ఆమెకు ఆటో డ్రైవర్‌ అశ్విన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా సన్నిహితంగా మారినట్లు తెలుస్తోంది. అయితే, అశ్విన్‌ మరో మహిళను వివాహం చేసుకోవాలని అంజలి కోరగా, అందుకు అతడు నిరాకరించినట్లు సమాచారం. తనతోనే కలిసి ఉండాలని అశ్విన్‌ పట్టుబట్టగా, అంజలి అందుకు అంగీకరించలేదు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆగ్రహానికి గురైన అశ్విన్‌ కత్తితో అంజలిపై దాడి చేసినట్లు తెలిసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular