Tuesday, October 13, 2026

నవీపేట్‌–బాసర రైల్వే ట్రాక్‌ పై

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

మృతుడి వయస్సు 35–40 ఏళ్లు..

ఆచూకీ తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13(ద్రోణ):- నవీపేట్‌–బాసర రైల్వే స్టేషన్ మద్య రైల్వే ట్రాక్‌ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అక్టోబర్‌ 12న రాత్రి 9.16 గంటలకు ముందు కిలోమీటర్‌ నంబర్‌ 443/29–31 వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గుర్తుతెలియని రైలు ఢీ కొనడం వల్లే వ్యక్తి మృతిచెంది ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే మృతుడి వివరాలు, గుర్తింపునకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై నిజామాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 192/2026, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు, కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే నిజామాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌. సాయి రెడ్డిని 8712658591 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular