లబ్ధిదారులకు వీల్చైర్లు, క్లబ్లకు కుట్టు మిషన్ల పంపిణీ
బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిని….

సందర్శించిన అంతర్జాతీయ లయన్స్ ప్రతినిధులు
బోధన్ టౌన్, అక్టోబర్ 14(ద్రోణ)::- లయన్స్ కంటి ఆసుపత్రిని సోమవారం ఉదయం 9 గంటలకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఐటీవీపీ అభ్యర్థి లయన్ విజయ్ కుమార్ రాజు, పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని బాబురావు, పలువురు మల్టిపుల్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ విజయ్ కుమార్ రాజుకు ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం అదే వేదికపై లయన్ విజయ్ కుమార్ రాజు చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు వీల్ చైర్లు, అర్హత కలిగిన లయన్స్ క్లబ్ లకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడనుంది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో థర్డ్ వైస్ ప్రెసిడెంట్గా లయన్ విజయ్ కుమార్ రాజు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన బోధన్ ఆసుపత్రిని సందర్శించడం స్థానిక లయన్స్ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వ్యక్తి కీలక బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయన రాక బోధన్ లయన్స్ కుటుంబానికి గర్వకారణమని సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ నాయకులు బసవేశ్వర్ రావు, ఘట్టమనేని బాబురావు, బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేత్రి కిరణ్, లయన్ 320-D గవర్నర్ విజయలక్ష్మి, జోన్ చైర్మన్ సితలె రమేష్, సీనియర్ లయన్ మేకల విఠల్, కిషోర్ ప్రభుదాస్, లయన్ తన్నీరు సుబ్బారావు తదితర లయన్స్ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.
