Thursday, October 15, 2026

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో నిజామాబాద్ నేతల భేటీ

పార్టీ బలోపేతం, జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చ..

ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్, అక్టోబర్ 13(ద్రోణ):- తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి జిల్లా నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు.

సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా నాయకులు ముఖ్యమంత్రితో సమావేశమై జిల్లా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, జిల్లాలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అరికెల నర్సారెడ్డి, నగేష్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular