ద్రోణ న్యూ ఢిల్లీ: జులై 25
ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని గురువారం ఉదయం రాష్ట్రపతి ముర్ము సందర్శించారు.
ఈ సందర్భంగా స్కూల్ బీ లోని విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన రాష్ర్టపతి విద్యార్థులకు పాఠాలు కూడ బోధించారు. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా పాఠశాలలో అందుతున్న విద్య, ఇతర సౌకర్యాల గురించిన వివరా లు అడిగి తెలుసుకున్నారు.
