కామారెడ్డి, ద్రోణ జూన్ 27
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆశీర్వాదంతో గెలుపొంది రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి నాటి నుండి పేదలకు నేటి వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఇద్దరమ్మ గృహాలు పేదలు నిర్మించుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళా మణులు వినియోగించుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శనివారం
మద్నూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే l గోడ గడియారాలను పంపిణీ చేశారు.ప్రతి ఇంటి అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం” అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం శ్రమిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

