హైదరాబాద్ ఆగస్టు 9 ద్రోణ
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అమెరికాలోని ప్రవాస తెలంగాణ ప్రజలతో రాష్ట్రానికి ఉన్న అనుబంధం తదితర అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.
అమెరికాలోని తెలంగాణ ప్రవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో ముచ్చటించారు.
తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో ప్రవాస తెలంగాణవాసుల భాగస్వామ్యం, వారి సూచనలు మరియు సహకారం ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.





