Saturday, September 12, 2026

సమాజ సేవ చేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యం

బోధన్ సెప్టెంబర్ 12 ద్రోణ

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో సేవ చేయడమే లక్ష్యమని ఇంటర్నేషనల్ ఎండి బసవేశ్వర రావు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని లయన్స్
క్లబ్ ఆఫ్ ఆచనపల్లి ఆధ్వర్యంలో విజేత కళాశాలలో అంగరంగ వైభవముగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ ఎండి 320 జిఎంటి లయన్ పి బసవేశ్వర రావు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ఎక్కడైతే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయో వారికి ఇంటర్నేషనల్ సంస్థ నిధులను సమకూర్చి వారికి తోడ్పడుతుందని సమాజానికి విశిష్ట కృషి చేస్తున్నటువంటి వారిని సన్మాన కార్యక్రమాల ద్వారా సమాజానికి తోడ్పాటును అందిస్తుందని దానిలో భాగంగానే గురుపూజోత్సవ కార్యక్రమాలు ఇండియా మొత్తం సెలబ్రేట్ చేస్తుందని పేర్కొన్నారు. మరొక విశిష్ట అతిధి ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లక్ష్మి మాట్లాడుతూ గురువులకు సమాజంలో అత్యున్నత స్థానం ఉన్నదని వారిని గౌరవించిన వారికే సమాజంలో గౌరవం లభిస్తుందని గురువుని ఎప్పటికీ మరిచిపోరాదని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి నాగయ్య మాట్లాడుతూ సమాజంలో లైన్స్ సేవలను కొనియాడుతూ గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గురువులను పాత రోజులలో కాకుండా కొత్తగా వచ్చినటువంటి పద్ధతులను నేర్చుకుంటూ సోషల్ మీడియా మరియు గ్యాడ్జెట్స్ ఉపయోగించుకుంటూ పిల్లలకు విద్యాబోధన చేయాలని పిల్లల్లో ఉన్నటువంటి చెడు అలవాట్లను రూపుమాపాల్సిన అవసరం తల్లిదండ్రులు మరియు గురువులు సమిష్టి కృషి చేయాల్సినటువంటి కార్యక్రమం అని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, శ్యాంసుందర్, రంగారావు, దుర్గారావు, రమణారెడ్డి, భగవాన్ కైలాసప్ప, వెంకటేశ్వరరావు, ఎస్ కృష్ణమోహన్, గాంధీ, హరిబాబు, సత్యనారాయణ శంకర్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular