ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ నియోజకవర్గంలోని విద్యార్థులకు బంగారు బాటలు వేయడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీరామ్ నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా పోచారం హాజరయ్యారు.
కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఆయన ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే నా లక్ష్యం – నాణ్యమైన విద్యతో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, కళాశాల కమిటీ సభ్యులు, బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల నాయకులు, కళాశాల అధ్యాపకులు,సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.













