Friday, September 4, 2026

రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

నిజాంబాద్ సి పి హెచ్చరిక

బోధన్ ఆగస్టు 3, ద్రోణ

రహదారులపై వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని సి పి సాయి చైతన్య హెచ్చరించారు.
బోధన్ బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం సంఘటన స్థలాన్ని సిపి పరిశీలించారు.
బోధన్ బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే * నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు , పరిస్థితులను పరిశీలించారు.
ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి , ట్రాఫిక్ నియంత్రణ , ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు చేశారు. రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని , ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సూచించారు.
సిపి వెంట బోధన్ ఎసిపి శ్రీనివాస్ ,బోధన్ రూరల్ సీఐ విజయబాబు , బోధన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular