Monday, August 10, 2026

మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఎంతో అవసరం

హైదరాబాద్ ఆగస్టు 9 ద్రోణ

ఆషాఢమాసం సందర్భంగా హైదరాబాద్ ,ఎల్ బి నగర్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో జరిగిన బోనాల మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం హైదరాబాద్, జియాగూడ సబ్జీ మండి మహంకాళి ఆలయ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు పోచారం మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ గజరాజు గజమాలతో పోచారం ని ఘనంగా సత్కరించి, ఆశీర్వదిస్తూ వారికి స్వాగతం పలికింది.
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, సాంప్రదాయాలను పరిరక్షించడంలో కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular