ప్రాణాలు కాపాడుకుందాం
సిపి వెల్లడి
426 కేసులు నమోదు
41,60,000 జరిమానా
నిజామాబాద్ ద్రోణ జూన్ 27
మద్యం సేవించి వాహనాలను నడపడం నిషేధించి ప్రాణాలను కాపాడుకుందాం అని నిజామాబాద్ సిపి సాయికుమార్ పిలుపునిచ్చారు. ఎంతోమంది అభాగ్యులు మద్యం మత్తులో తమ ప్రాణాలను కోల్పోవడంతో పాటు ఎదుటివారి ప్రాణాలను తీసిన సంఘటనలు ఎన్నో జిల్లాలు చోటుచేసుకున్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా గుర్తించి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిర్మూలిద్దామని సిపిఎస్ స్పష్టం చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 426 నమోదు జరిమానా 41,60,000/- విధించిన సంబంధిత కోర్టులు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన 2 వారాలలో డ్రంకన్ డ్రైవ్ లో 426 మంది పట్టు బడగా వారిని నిజామాబాదు , బోధన్ మరియు అర్మూర్ కోర్టులలో హాజరు పర్చగా ఇందులో 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని మిగిలిన వారికీ 41,60,000/- జరిమానా విధించినట్లు సిపి తెలిపారు. తనిఖీలలో అధిక మొత్తములో మద్యం సేవించి వాహనములు నడిపి పోలీస్ లకు పట్టుబడుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా తేది:15-06-2026 నుండి తేది: 27-06-2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 426 కేసుల నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
1) ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు.
2) వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు.
3) డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడును.
4) మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదు.
5) మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్ మరియు వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడును అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదు.
6) ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడును.
7) మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ – 2019) అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడును. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుననీ నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరించారు.
