కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర జలశక్తి శాఖ మంత్రివి సీఆర్ పాటిల్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 33 క్రస్ట్ గేట్లను కొత్తగా ఏర్పాటు చేయగా, మీట నొక్కి 17వ గేటును సీఆర్ పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ , 19వ గేటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , 20వ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
2024 ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా 19వ గేటు దెబ్బతినడంతో, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర జలాల సమర్థ నిర్వహణ, సాగు మరియు తాగునీటి అవసరాల భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ గేట్ల పునరుద్ధరణ కీలక మైలురాయిగా నిలవనుంది.



