Tuesday, February 17, 2026

తెలంగాణ బడ్జెట్ పేదల అభ్యున్నతికి ప్రాధాన్యం

ద్రోణ హైదరాబాద్

శాసనసభలో బడ్జెట్ సమర్పణ తదుపరి అసెంబ్లీ మీడియా హాల్ -1 లో  మీడియాతో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చిట్ చాట్.
చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,  ప్రిన్సిపల్ సందీప్ సుల్తానియా, కృష్ణ భాస్కర్ హరిత తదితరులు.

భట్టి విక్రమార్క మీడియా చిట్ చాట్ గత ప్రభుత్వం బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలను దళిత బందుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్లో దళిత బంధు ప్రస్తావించలేదని మాట్లాడటం నవ్వాలా? ఏడ్వాలో? అర్థం కావడం లేదు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం మాదిరిగా డైవర్ట్ చేయం. బ్యాక్లాగ్ నిధులను కూడా కలుపుకొని దళిత, గిరిజనులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెడతాం.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం  సంక్షేమం- అభివృద్ధి కి సమభాగంలో నిధులు వెచ్చిస్తూ మేలు కలయికతో ముందుకు తీసుకువెళ్తున్నాం.
హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనకు ఎన్నడు లేని విధంగా ఈ బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించాం.

హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నది

హైదరాబాదులో ఉద్యోగ వ్యవస్థలు రావడానికి కావలసిన ఎకో సిస్టం డెవలప్ చేయడానికి కావలసిన నిధులను పెట్టుబడిగా పెడుతూ మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నది.
రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్న హైదరాబాదును అభివృద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పెట్టుకున్నాం.భవిష్యత్ తరాలకు అవసరమయ్యే హ్యూమన్ రిసోర్స్ తయారీ కోసం హైదరాబాదులో పునాదులు వేస్తున్నాం.
హైదరాబాదులో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విజీనరితో తీసుకున్న మిషన్.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ పైన పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం.
అంగన్వాడీ లను మూడవ తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో 4వ తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నాం.ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుతో దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలువబోతున్నది.
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం విద్యా వైద్యం వ్యవసాయం హైదరాబాద్ అభివృద్ధి కీ ప్రత్యేక ఫోకస్ పెట్టి బడ్జెట్లో పెద్దపీట వేశాం.
హైదరాబాదులో ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా ఉండబోతుంది.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది నిధులు కేటాయించాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు గా చేయాలని మా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి బడ్జెట్లో నిధులను కేటాయించింది.
ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని  మహిళా సంఘాలకు 20 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. వారు చెల్లించాల్సిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ప్రతి నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాం.
మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీలను వారికి కేటాయించబోతున్నాం.
ఇందిరమ్మ రాజ్యం లో ప్రజా ప్రభుత్వం వారికి అందించే ప్రోత్సాహకాల వల్ల మహిళలు ఆర్థిక పరిపుష్టి తో ఆర్థిక సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తారు.
ఇందిరమ్మ రాజ్యం లో మహిళలను మహాలక్ష్మిలుగా కొలుస్తాం.
డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైదరాబాదులో మూడున్నర ఎకరాలు భూమిని మహిళల కోసం కేటాయించాం.
రాష్ట్రంలో మహిళలందరి పై సమానమైన దృష్టిని మా ప్రభుత్వం కేంద్రీకరించి వారి అభివృద్ధికి పాటుపడుతుందని బట్టి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular