కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం
దీనిని మేము ప్రతిఘటిస్తాం
పార్లమెంట్ లో మా వాణి వినిపిస్తాం
ఢిల్లీ మీడియా పాయింట్లు వ్యక్తం చేస్తున్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్
ద్రోణ ఢీల్లీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కుర్సీ బచావో బడ్జెట్ అని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం నిలువడానికి బీహార్ ఏపీ లకు తాయిలాలు ఇచ్చారన్నారు. తమ కూటమి నిలిచేందుకే సంతృప్తి వాద రాజకీయాలు అనుసరిస్తున్నారని విమర్శించారు. ఇదంతా బీజేపీ క్విడ్ ప్రో కో వ్యవస్థను నడుపుతున్నట్టు ఉందన్నారు. ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తమకేమీ అభ్యంతరం లేదని తమ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలపై ఎలాంటి కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. గత పదేండ్లలో బీజేపీ, బీఆర్ ఎస్ లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఓవర్ హాల్ యూనిట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా బిజెపికి పట్టవని విమర్శించారు. తెలంగాణ పుట్టుకను ఇష్టపడని ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణపై వివక్ష కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మరో సారి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారని, ప్రతి సారిలాగే ఈ సారి కూడా కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష కొనసాగించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బిజెపి మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు ఇక్కడ గెలిచిన బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేండ్లలో బిజెపి బీఆర్ఎస్ లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయన్నారు. దీనిని తాము ప్రతిఘటిస్తామని, పార్లమెంట్ లో మా వాణి వినిపిస్తామని స్పష్టం చేశారు.
