ద్రోణ కోటగిరి జూలై 26
వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఏ కార్యక్రమము విజయవంతం కావాలంటే ప్రభుత్వం అధికారులు చేసే కృషి కంటే ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని బోధన్ ఎక్సైజ్ సిఐ పవన్ గౌడ్ అన్నారు.
ఈత ఖర్జూర చెట్ల పెంపకం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన కల్లు అందించే వీలు కలుగుతుందన్నారు. కోటగిరి మండల కేంద్రంలో రాంపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివార్ల సంఘ రాష్ట్ర కార్యదర్శి విటల్ గౌడ్ ఆధ్వర్యంలో రాంపూర్ చెరువు కట్ట పైన ఈత ఖర్జూర మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ సి ఐ పవన్ గౌడ్ ఎస్సై రామ్ కుమార్ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గీతా కార్మికులు ఈత ఖజురా 500 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బోధన్ ఎక్సైజ్ సి ఐ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన వన మహోత్సవం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. గీత కార్మికులు చెరువు కట్టలపై ఈత ఖర్జూర చెట్ల పెంపకం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన కల్లు ఇవ్వటానికి ఉపయోగపడుతుందని అన్నారు. గీతా పని వాళ్ళ సంఘం గ్రామాలలో గీతా కార్మికుల చైతన్యం చేస్తూ వనం పెంపకం చేస్తున్న గీతా సంఘం నాయకులకు అభినందించారు. ఉపాధి హామీ చట్టం ద్వారా గీత కార్మికులు ఖర్జూరా ఈతవనాన్ని పెంచితే ఒక్క చెట్టుకు 5 రూపాయలు మెంటెనెన్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ ఫీల్డ్ ఆఫీసర్ టి ఎఫ్ టి కార్మికులు రాజా గౌడ్ సురేష్ గౌడ్ గీతా పని వాళ్ళ సంఘం మండల కమిటీ నాయకులు బి వెంక గౌడ్ కొత్తపల్లి శ్రీధర్ గౌడ్ బి పండగ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ యాదగిరి గౌడ్ గీత కార్మికులు పాల్గొన్నారు.
