అధికారుల నిఘా లేకపోవడం
కార్పొరేట్ హాస్పిటల్స్ లలో
నీరు అంటుతున్న ఆరోగ్యశ్రీ
పర్మిషన్లు తీసుకోవడమే కానీ పట్టించుకునే నాధుడే లేదు
ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం
తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సలు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వం జీవోను జారీ ఈనెల 30న చేస్తుంది. అందులో భాగంగా పదమూడు వందల డేబై ఐదు ప్యాకేజీల ధరలను సవరిస్తుంది.
మిగిలిన రెండు వందల తోంబై ఏడు ప్యాకేజీ ధరలలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈమధ్య కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను చేరుస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రంగంలోనికి వచ్చిన తర్వాత సగటు 20% ధరలను పెంచుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలలో 438 కోట్ల అదనపు భారం ప్రభుత్వం పైనే పడుతుందని చాలామంది బీద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని పేదలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కి సంబంధించిన అదనపు ఖర్చు 600 కోట్లు పెరిగిన ఆరోగ్యశ్రీ ట్రస్టు దాదాపు ఆరు లక్షల మందికి బాసటగా నిలుస్తుందని కొత్త ప్రొసీజర్ తో మరికొన్ని లక్షన్నర కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు.
